ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 5:47 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

జలపాతంలోకి దూసుకెళ్లిన కారు…. ఎనిమిది మంది మృతి

భువనేశ్వర్:అర్జున్ సమాచారం:
మధ్యప్రదేశ్ రాష్ట్రం అగర్ మాల్వా జిల్లా నల్కేద వద్ద ఓ జలపాతంలోకి కారు దూసుకెళ్లడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ ని జయదేవ్ విహారకు చెందిన ఎనిమిది మంది ఉజ్జయిని బగళాముఖి అమ్మవారి దర్శనానికి కారులో బయలుదేరారు. మార్గంమధ్యలో వీరు ప్రయాణిస్తున్న కారు.. నల్కేద వద్ద అదుపుతప్పి జలపాతంలోకి దూసుకెళ్లింది.

మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
============================